పంచాయతీ కార్మికుడు కరెంటు షాక్ తో భూక్యా వెంకటేశ్వర్లు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో డ్యూటీలో ఉండి కరెంటు షాక్ తో చనిపోయారు
బూర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామ పంచాయతీ లో పనిచేస్తున్న కార్మికుడు డ్యూటీలో ఉండి మృతి. భూక్యా వెంకటేశ్వర్లు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ల అమ్మ పంచాయతీ కార్మికురాలుగా కొంతకాలం పనిచేస్తూ ఆమె రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా తన పనిలో కొడుకుని పనిలో పెట్టించిన తల్లి భద్రమ్మ పంచాయతీ ఆఫీసులో పెట్టించి నాలుగో రోజా పనిలోకి చేరి కరెంటు షాక్ తో మృతి చెందాడు .కుటుంబానికి 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి .ఆ కుటుంబంలో భార్యకి ఉద్యోగం కల్పించాలని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేశారు .ఆ కుటుంబానికి న్యాయం జరగకుండా అధికారులు ఏమన్నా ప్రయత్నిస్తే సహించేది లేదు ఆ కుటుంబానికి న్యాయం జరగాలని అన్నారు జూలూరుపాడు మండలంలో పంచాయతీ కార్మికులు డ్యూటీలో ఉండి చనిపోతే ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అతనికి ఆ కుటుంబానికి 10 లక్షలు వచ్చే విధంగా అక్కడ సిఐటియు ధర్నా చేసి సాధించారు .ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇచ్చారు అదేవిధంగా బూర్గంపాడు మండలంలో పంచాయతీ కార్మికులకు భద్రత లేకుండా ఉంది అందువల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు వెంటనే ప్రభుత్వం అధికారులు భూక్యా వెంకటేశ్వర్లు కుటుంబానికి న్యాయం జరిగేలా చేయాలని అన్నారు
إرسال تعليق