ప్రజా పాలన విజయోత్సవ సంబరాల సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు
తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ ప్రజా పాలన సంబరాల పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ గుత్తా అమిత్ రెడ్డి
బాణాసంచా కాల్చి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు సీ.ఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం.
అశ్వాపురం మండలం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా మంగళవారం నాడు అశ్వాపురం దోసపాటి రంగారావు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంబరాలకు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు , ప్రజా పాలన విజయోత్సవాల నియోజకవర్గ కోఆర్డినేటర్ అమిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున బాణసంచ కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు గారు,మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో ప్రజా రంజక పాలన సాగిస్తుందన్నారుఅని ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ 500 కే గ్యాస్, రైతులకు రూ 2 లక్షల రుణమాఫీ పథకాలను అమలు చేసి , ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ 2500 ఆర్థిక సాయం అమలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి అన్నారు. ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, పేదల కోసం, ప్రజల కోసం పనిచేసే ప్రజా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిన పాపం, గత పాలకులదని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న మొక్కవోని దీక్షతో ధైర్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయటం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యయమన్నారు. ప్రభుత్వం చేసిన కుంభకోణాలు, దందాలకు పేదలపై భారం పడిందన్నారు. గత పదేండ్ల లో బీ ఆర్ ఎస్ ఇచ్చిన హామీలలో ఉచిత ఎరువులు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఎందుకు అమలు చేయలేక పోయిందో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ధరణి పేరుతో రాష్ట్రంలో ఉన్న భూములన్నీ బీ ఆర్ఎస్ నాయకులకు అన్యాక్రాంతమయ్యాయన్నారు. లగచర్ల ఘటనలో బీ ఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని చూసి, బొక్క బోర్లా పడ్డారన్నారు. ఈ రాష్ట్రంలో ఆర్థికపరమైన సమస్యలు ఎన్ని ఉన్నా సంక్షేమ పథకాల అమలకు వెనుకాడబోమని, బీ ఆర్ఎస్ నాయకులకు గ్రామాల్లో కొచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. వరి వేస్తే ఉరే అన్న సన్నాసులు ఎక్కడ.. సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతో, క్వింటా కు 500 రూపాయల బోనస్ ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడా ? అని నిలదీయాలని సూచించారు. మరో ఏడాదిలో అద్భుతమైన అభివృద్ధితో దేశం గుర్తించేలా రాష్ట్ర పాలన ఉండబోతుంది అని తెలియజేసి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమానికి పినపాక మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య గారు ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మాజీ సర్పంచులు,మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
إرسال تعليق