గురుకుల విద్యార్థిని అమూల్యను పరామర్శించిన రవీందర్ రెడ్డి
పినపాక, డిసెంబర్ 24 , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
పినపాక మండలం పెంటన్నగూడెం గ్రామానికి చెందిన గుమాస్ అమూల్య పాల్వంచ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.ఇటీవల అనారోగ్యానికి గురై 15 రోజుల పాటు పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొంది.డిసెంబర్ 21న డిశ్చార్జి అయి ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుకున్న కాంగ్రెస్ నాయకుడు ఉడుముల రవీందర్ రెడ్డి గురువారం వారి ఇంటికి వెళ్లి అమూల్య తో ముచ్చటించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పరామర్శించారు.ఆ కుటుంబానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో మాట్లాడి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి