స్వీయ పరిపాలన కోసం రూపొందించబడింది పీసా చట్టం; ఎంపీడీవో రామకృష్ణ

 స్వీయ పరిపాలన కోసం రూపొందించబడినది పీసా చట్టం : ఎంపీడీవో రామకృష్ణ.

 పినపాక. ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,పినపాక మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం నందు పీసా చట్టం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పినపాక పంచాయతీ సెక్రటరీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీవో రామకృష్ణ అధ్యక్షతన స్థానిక సెక్రటరీ పి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజల చేత గ్రామసభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీవో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 1996లో పిసా చట్టాన్ని రూపొందించిందని ,దీని ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతాలలో స్వీయ పరిపాలన, గ్రామ సభల ద్వారా స్వయం పాలనను ప్రోత్సహిస్తుందని, గ్రామస్థాయి ప్రణాళికలు రూపొందించడం, సహజ వనరులపై సంప్రదాయ హక్కులను గుర్తించే క్రమంలో పీసా చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు ఈ గ్రామ సభలో స్థానిక సెక్రటరీ పి ఉమామహేశ్వరరావు, పంచాయతీ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ సోంపల్లి శ్రీను, డ్వాక్రా గ్రూప్ మహిళలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది