ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మండల పరిధిలోని ఏడూళ్ళ బయ్యారం సెయింట్ మేరీస్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నృత్యాలతో అలరించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్రీస్తు జనన నమూనా అందరినీ ఆకట్టుకుంది. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రిన్సిపల్ రజిత బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి