విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి; ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

 విద్యార్థులకు మేనూ ప్రకారం భోజనం అందించాలి 

-ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

 పినపాక , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్; 

ప్రభుత్వ పాఠశాలలో ,హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం అందజేయాలని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం పినపాక మండల పర్యటనలో భాగంగా మండల పరిధిలోని ఐలాపురం ఆశ్రమ పాఠశాలను ఆయన పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయంలో మెనూ పరిశీలించారు. విద్యార్థులను అడిగి విద్యా విధానం ,భోజనం గురించి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలు ఉంటే తనకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యాన్ని పరిశీలించారు. నీటి ట్యాంకులను శుభ్రం చేయాలని సూచించారు. మెనూలో తేడా వస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పొట్లపల్లిలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పినపాక కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, ఉడుముల రవి, సాంబ, కొరసా బాలకృష్ణ, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా పతినిధులు తోలేం కళ్యాణి, ఈసం భవతి, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది