పినపాక: యువతి పై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన ఎస్ఐ రాజ్ కుమార్

ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:



పినపాక మండలం చెగర్శల గ్రామానికి చెందిన యువతి పై అదే గ్రామానికి చెందిన తోట దుర్గయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. శనివారం తోట దుర్గయ్య (48), ముక్కెర శ్రీను (45) మానసిక పరిపక్వత లేని యువతిని టార్గెట్ చేశారు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో యువతీ ఇంటి వద్ద ఎవరు లేరని గ్రహించి.. ముక్కెర శ్రీను ని ఇంటి బయట కాపలా పెట్టి తోట దుర్గయ్య ఇంట్లోకి ప్రవేశించి ఆ యువతి చేయి పట్టుకొని శారీరకంగా లొంగదీసుకోవాలి ప్రయత్నం చేశాడని ఏడూళ్ళ బయ్యారం ఎస్ఐ రాజకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఆ యువతి భయపడి కేకలు వేసింది. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏంటా అని బయటికి వచ్చి చూడగా దుర్గయ్య, శ్రీను అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.

Post a Comment

కొత్తది పాతది