ఆన్లైన్ యాప్స్ ద్వారా మోసపోవద్దని సూచనలు చేస్తున్న సైబర్ క్రైమ్ సీఐ జితేందర్

 *ఆన్లైన్లో యాప్స్ ద్వారా మోసపోవద్దని సూచనలు చేస్తున్న సైబర్ క్రైమ్ సీఐ జితేందర్...*

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్; 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం వ్యాప్తంగా పలువురు ఇటీవల కాలంలో యాప్ లో పెట్టుబడి పెడుతూ అనంతరం డబల్ వస్తుంది అనే మోసంలో పడిపోతున్నారు...

ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇటీవల కాలంలో భద్రాచలంలో అక్షర చిట్ ఫండ్స్ ,కనకదుర్గ చిట్ ఫండ్స్, ఇలా పేరు పొందిన బ్రాంచీలు కలిగినటువంటి వారి చేతులెత్తేసి మోసం చేసిన పరిస్థితి.తస్మాత్  జాగ్రత ఆన్లైన్లో యాప్ల ద్వారా డబ్బులు పెట్టుబడి పెట్టొద్దు అదంతా మోసం జరుగుతుందని సైబర్ క్రైమ్ సంబంధించిన అధికారులు ప్రజలకు అవగాహన కలుగజేస్తూ ఉన్నారు.ఈ విషయంపై సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్న సిఐ గారికి చరవాణి ద్వారా విషయం తెలియజేయడం జరిగింది ఆయన అటువంటి ఆన్లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టి తాత్కాలికంగా వచ్చే ఆదాయాన్ని చూసి మోసపోవద్దని ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయని దయచేసి డబ్బులు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత మోసపోయామని బాధ పడొద్దు అని సూచించారు... 

దయచేసి మీరు ఎన్నో విధాలుగా రాత్రింబవళ్లు కష్టపడి మీ కుటుంబం కోసం సంపాదించుకున్న డబ్బులు... ఎవరో మీకు చెప్పారని స్నేహితుల ద్వారా విని లాభాల కోసం పెట్టుబడులు పెట్టి రూపాయికి రూపాయి కలిసొస్తుందని ఆశతో మీ దగ్గర ఉన్న డబ్బులు మీకు తెలియని విషయాలకు స్పందించి పెట్టుబడులు పెట్టి మీరు కష్టపడిన సొమ్మును కోల్పోవద్దు.

Post a Comment

కొత్తది పాతది