పెద్దపులి పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి- సిఐ వెంకటేశ్వరరావు
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
గత కొన్ని వారాలుగా పెద్దపులి ములుగు, భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి దాడికి పాల్పడలేదు. బుధవారం కరకగూడెం మండలం రఘునాధపాలెం పంచాయతీ పరిధిలో గల మేకల గుంపు పై దాడి చేసింది. ఈ సందర్భంగా ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. కరకగూడెం మండలం పరిధిలో మేకల, పశువుల కాపరిలు అడవి ప్రాంతానికి వెళ్లకూడదని సూచించారు. అలాగే అడవికి దగ్గర్లో ఉన్న పొలాలకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లకూడదన్నారు. పెద్దపులి ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో తెలియనందున ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి