ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలి

 ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలి

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్; 

ఏబిసిడి వర్గీకరణ కోసం ప్రత్యేక పర్యటన చేస్తూన్న ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమిమ్ అక్తర్, రిటైర్డ్ జస్టిస్ ని కలిసి ఏబిసిడి వర్గీకరణ చేయాలని మాదిగ లాయర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొలుగూరి సదయ్య వకీల్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే రాష్ట్రము యూనిట్ గా వెంటనే అమలు చేయాలన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో 59 కులాలు ఉండగా జనాభా ప్రకారం రిజర్వేషన్లలో ఎవరి వాటా వారికి చెందే విధంగా వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేసి అట్టి కులాలకు న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మట్టిల తిరుపతి, మారేపల్లి ప్రభాకర్, మోరే కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది