ఆదివాసి గ్రామ ప్రజలకు దోమతెరలు పంపిణీ
పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పిట్టతోగు గ్రామంలో ఆదివాసీలకు ప్రానిక్ హీలింగ్ ఫౌండేషన్ సహాయంతో ఎడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్ లు వలస ఆదివాసి గ్రామ ప్రజలకి బుధవారం దోమతెరలు పంపిణీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రానిక్ హీలింగ్ సభ్యులు ఎస్కే సొందు పాషా పాల్గొన్నారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి