పినపాక కౌంటర్ బుల్లెట్ న్యూస్:
పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు సోమవారం సాయంత్రం వాహనాలు తనిఖీలు నిర్వహించారు. పలు వాహనాల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు వేపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాహనదారులు అతివేగంగా ప్రయాణాలు చేయకూడదని హెచ్చరించారు. ట్రాక్టర్ ట్రాలీ వంటి వాహనాలు రేడియం స్టిక్కర్లు తప్పకుండా ఉండాలన్నారు. తాగి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. రాత్రి సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడవు కాబట్టి నిదానంగా ప్రయాణాలు చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు నడపొద్దని తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి