తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి
-12వ రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె
-సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేయాలి
పినపాక, డిసెంబర్ 21, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రెగ్యులర్ చెయ్యాలని, జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని విద్యా శాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు 12 రోజులుగా సమ్మెబాట పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరంలో బిఆర్ఎస్ ప్రభుత్వ ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మెలో 22 రోజులు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా ఆనాటి టిపిసిసి ఛీప్ రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం వచ్చి 30 రోజుల్లోనే సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తాను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని హక్కులు కల్పిస్తానని సమగ్రశిక్ష ఉద్యోగులను, ఎంటిఎస్ ఉద్యోగులకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిన మా హక్కులు ఇంకా నెరవేరకపోవడంతో ఈనెల 6 నుండి 10వ తేదీ వరకు నిరసన చేపట్టడం జరిగిందని తెలిపారు. తర్వాత ఈనెల 10వ తారీకు నుండి పూర్తిగా ఎం ఆర్ సి, సి ఆర్ సి, కే జి బి వి భవిత కేంద్రాలలో పని చేస్తున్న ఉద్యోగులందరూ ఈ నెల 10 వ తారీకు నుండి సమ్మె బాటపట్టేమని తెలిపారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి