ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కరింగ్ ఉపయోగకరం ; ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు

 ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కరింగ్ ఉపయోగకరం : ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు . 

పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;




రోడ్డు ప్రమాదాల నివారణకై వాహనాలకు రేడియం స్టిక్కరింగ్ ఉండటం తప్పనిసరి అని సర్కిల్ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ట్రాలీలకు ఇతర వాహనాలకు రేడియం స్టిక్కరింగ్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాలకు రాత్రి సమయాల్లో రిఫ్లెక్టింగ్ ద్వారా చీకట్లో ఉన్న వాహనాలు సైతం కనబడే విధంగా ఈ రేడియం స్టిక్కరింగ్ ఉపయోగపడుతుందన్నారు. రైతులు రాత్రిపూట పశువులను సైతం రోడ్లమీద కు వదలొద్దని, రహదారులకు ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేసేటప్పుడు రోడ్లకు అడ్డంకిగా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది