మాజీ జడ్పీటీసీ కొమరం కాంతారావు తెలంగాణ జన సమితి లో చేరిక

 మాజీ జెడ్పిటిసి కొమరం కాంతారావు తెలంగాణ జన సమితిలో చేరిక 

• కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కోదండరాం

కరక గూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్; 

కరక గూడెం మాజీ జడ్పీటీసీ కొమరం కాంతారావు తెలంగాణ జన సమితి పార్టీ లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ గోపగాని శంకర్రావు నేతృత్వంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం తన నివాసం లో కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర జన సమితి పార్టీలో చేరిన అనంతరం తన సొంత మండలంలోని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా గొపగాని శంకర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మన గోడు వినిపించుకునే ప్రభుత్వ ఉన్నందున సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక తోవ దొరికిందని అన్నారు . రానున్న కాలంలో జన సమితిలోకి మరిన్ని చేరికలు జరుగనున్నాయని శంకర్రావు తెలిపారు. ఈ సందర్భంగా కొమరం కాంతారావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా రాజకీయం చేస్తూ ప్రజల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ కష్టసుఖాలను కుంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేశాను... గత గతంలో నేను ఉన్న పార్టీ లో అణచివేశారని ఆత్మ అభిమానంతోనే ఆ పార్టీ నుండి బయటికి వచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని చెప్పారు. త్వరలోనే నియోజక వర్గo గోపగానీ శంకర్రావు నేత పినపాక నియోజకవర్గం మొత్తం పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం దిశగా ప్రయత్నిస్తాను అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ గోపగాని శంకర్రావు, నియోజక వర్గ కోఆర్డినేటర్లు మూల నాగి రెడ్డి, సూరకంటి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ జన సమితి గుండాల మండల అధ్యక్షులు గొల్లపల్లి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుంజా రామ్మూర్తి, సీనియర్ నాయకులు గడ్డం భద్రం , ఉన్నం సతీష్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

కొత్తది పాతది