మణుగూరు మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలు
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కోలాటాలతో ఎమ్మెల్యే పాయం కి ఘన స్వాగతం పలికిన మహిళా సంఘాల నాయకులు, మహిళా సోదరీమణులు
తెలంగాణ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు మహిళా సోదరీమణులు విద్యార్థిని విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తో భారీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సంబరాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ పాయం మహిళ నాయకులు మహిళా సోదరీమణులు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు, అనంతరం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)
పట్టణ స్వయం సహాయక సంఘాలకు
(15 సంఘాలకు) 2,000000 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు, అనంతరం మహిళా నాయకులు మహిళా సోదరీమణులు విద్యార్థులు విద్యార్థులతో తెలంగాణ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీలో పాల్గొన్నారు పాయం గారు మాట్లాడుతూ ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించిన మున్సిపాలిటీ వారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళ సోదరీమణులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి మణుగూరు పరిధిలోని మున్సిపాలిటీలో ఈ మధ్యనే అనేక అభివృద్ధి పనులకు 17 కోట్లు మంజూరు చేశామని మున్సిపాలిటీ పరిధిలోని కట్టు వాగు పూడిక పనులను పూర్తి చేశామని దానివల్ల శాశ్వతంగా మణుగూరు పట్టణానికి వరద ముంపు ఉండదని, అకాల వర్షాల వలన ముంపుకి గురైన2500 కుటుంబాలకు తక్షణ సాయం కింద 16000 రూపాయలు ఆర్థిక సాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని వరదల వల్ల మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని 24 గంటలులో అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి చెందిందని ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన నేరుగా తన దృష్టికి తీసుకురావాలని తక్షణమే సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు ఎమ్మార్వో రాఘవ రెడ్డి గారు,మణుగూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి గౌడ్ గారు, AE సత్యనారాయణ గారు, TPS భాస్కర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు,మాధవి గారు,మహిళా సంఘాల నాయకులు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి