EB NEWS/హైదరాబాద్:
నేడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‌లో దూసుకుపోతోంది. పంజాబ్ కింగ్స్‌పై ఆడుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. కేవలం 22 బంతుల్లోనే 66 పరుగులు చేసి బౌలర్లపై ఎటాక్ కొనసాగించారు.
అభిషేక్‌కు తోడుగా త్రివాస్ హెడ్ కూడా చక్కటి సహకారం అందిస్తూ 15 బంతుల్లో 31 పరుగులు సాధించారు. ఈ జంట దూకుడుతో పవర్‌ప్లే ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 ఓవర్లలోనే 105 పరుగులు నమోదు చేసి అరుదైన రికార్డు సృష్టించింది.
పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నప్పటికీ, ఈ మ్యాచ్‌లో SRH జట్టు మెరుపు ఆటతీరుతో బలమైన సందేశాన్ని ఇస్తోంది. ఇదే జోరు కొనసాగితే భారీ స్కోర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి