EB NEWS/భద్రాద్రి:
భద్రాద్రి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం రవాణాపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పీడీఎస్ బియ్యం దుర్వినియోగంపై అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో మొత్తం 450 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇల్లందు మండలంలో 200 క్వింటాళ్లు, టేకులపల్లి మండలంలో 250 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు వెల్లడించారు. ఈ దాడులు అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా ఫలితమని పేర్కొన్నారు.
రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు కొనసాగుతాయని, ఎవరూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి