EB NEWS/ భద్రాచలం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన చిన్నారితో కలిసి వంతెనపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
స్థానికుల కథనం ప్రకారం, ఘటనను గమనించిన ప్రజలు వెంటనే కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు చాకచక్యంగా స్పందించి నదిలోకి దిగి తల్లి, చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు.
అనంతరం వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి