థ్యాంక్యూ రేవంతన్నా.. ములుగుకు గోదావరి జలాలు – మేడారం అభివృద్ధి: సీతక్క కృతజ్ఞతలు

 


ములుగు, ఎన్ కౌంటర్ న్యూస్:


మేడారం ఆలయ అభివృద్ధి, ములుగు నియోజకవర్గానికి గోదావరి జలాల అందుబాటు... ఇవే తన జీవితంలోని రెండు గొప్ప కలలని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, మంత్రివర్గ సహచరుల సహకారంతో ఆ రెండు కోరికలూ నెరవేరినట్టు ఆమె వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేరును యావత్ ఆదివాసి సమాజం, ములుగు నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని సీతక్క పేర్కొన్నారు. తన జన్మ ధన్యమైందని భావిస్తున్నానంటూ, “థ్యాంక్యూ రేవంతన్నా” అంటూ భావోద్వేగంగా కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

కొత్తది పాతది