పినపాక: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
గోపాలరావు పేట మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ మెగా టోర్నమెంట్ ఈరోజు క్లైమాక్స్‌కు చేరింది. చివరి రోజు ఫైనల్ మ్యాచ్ రసవత్తర వాతావరణంలో జరగనుంది. టోర్నమెంట్‌లో రెండు రోజులుగా సాగిన లీగ్, సెమీఫైనల్ ఆటల్లో ఆటగాళ్లు తమ ప్రతిభ చాటగా, విజయాన్ని సాధించాలన్న ఉత్సాహంతో ఈరోజు ఫైనల్లో రెండు జట్లు తలపడుతున్నాయి.
గోపాలరావుపేట మైదానంలో నిర్వహిస్తున్న ఈ వాలీబాల్ ఘన క్రీడా ఉత్సవానికి గ్రామ పెద్దలు, యువత, ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని మేనేజ్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోపాలరావు పేట మేనేజ్‌మెంట్ సభ్యులు, క్రీడా అభిమానం గల స్థానిక ప్రముఖులు హాజరై ఆటగాళ్లను ఉత్సాహపరిచనున్నారు. విజేతలకు నేడు బహుమతులు మరియు ట్రోఫీలు ప్రదానం చేయనున్నారు.
ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండబోతుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి