ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీగా పోటీ చేయాలంటే అర్హతలు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం!
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గానికి (ఎంపీటీసీ)గా పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు ఇవే!
ఎంపీటీసీ గా పోటీ చేసే అభ్యర్థులు ఆ మండలంలో ఓటరుగా నమోదై ఉండాలి. మండలంలో ఎక్కడి నుండైనా రిజర్వేషన్‌ను బట్టి పోటీ చేయవచ్చు. అభ్యర్థుల నామినేషన్ సమయంలో నేర చరిత్ర, అప్పులు, విద్యార్హతల వివరాలకు సంబంధించిన స్వీయ ప్రకటన అందజేయాలి.
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జడ్పీటీసీ) మెంబర్‌గా పోటీచేసేందుకు నామినేషన్ వేయాలంటే, ఆ జిల్లా పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. జిల్లాలో ఎక్కడి నుండైనా పోటీ చేయవచ్చు, రిజర్వేషన్‌ను అనుసరించి పోటీచేయాలి.
ఎంపీటీసీ, జడ్పీటీసీ మెంబర్‌గా పోటీ చేయాలంటే అభ్యర్థులకు కనీస వయస్సు 21 సంత్సరాలు నిండి ఉండాలి. గ్రామసేవకులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, డైరెక్టర్లు పోటీ చేయడానికి అనర్హులు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఇవే!
అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్
రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు
అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు
నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ మెంబర్‌గా పోటీ చేయాలంటే అభ్యర్థుల అర్హతలకు సంబంధించిన పూర్తివివరాలు అక్టోబర్ 9న వెలువడనున్న స్ఠానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు....
కామెంట్‌ను పోస్ట్ చేయండి