బ్రేకింగ్ న్యూస్:మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

 

భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఈరోజు ఉదయం 08.15 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం 43.00 అడుగులకు చేరుకున్నది . ప్రస్తుతం 9,32,288 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక (1st Warning) జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.


  గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు . వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని, ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.ప్రజలు రక్షణ చర్యల్లో సహకరించాలని, అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ కోరారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లకు సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Post a Comment

కొత్తది పాతది