గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

 


భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలి


అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్


ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నది.కావున గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతుందని తెలియజేశారు.అత్యవసరమైతే తప్పు బయటికి రావద్దని సూచించారు.గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయని తెలిపారు.ఉదృతంగా ప్రవహిస్తున్న చెరువులు,వాగులు,వంకల వద్దకు వీడియోల కోసం,సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు.వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో ఉంటే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.



Also read...

గోదావరి వరద ముంపునకు గురి అయ్యే గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఐటీడీఏ ప్రాజెక్టు అధికా బి. రాహుల్.



గోదావరి నది నీటిమట్టం 43 అడుగులకు చేరుకుని క్రమేపీ పెరుగుతూ... ఉదృతంగా ప్రవహిస్తున్నందున, గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత గిరిజన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


ఉదృతంగా ప్రవహిస్తున్న చెరువులు,వాగులు,వంకల వద్దకు వీడియోల కోసం,సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు.వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదివే గిరిజన విద్యార్థినీ విద్యార్థులు పొంగుతున్న వాగులు, చెక్ డ్యాముల వద్దకు వెళ్లకుండా చూడాలని అన్నారు. 


అత్యవసరమైన విపత్కరమైన పరిస్థితులలో సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలి.  

*భద్రాద్రి కొత్తగూడెం@పాల్వంచ 08744-241950,(వాట్సాప్) 93929 19743* 

*ఐటీడీఏ భద్రాచలం కంట్రోల్ రూమ్ నెంబర్ 799 5268 352*

*సబ్ కలెక్టర్ ఆఫీస్, భద్రాచలం 08743-2324444, (వాట్సాప్) 93479 10737*

Post a Comment

కొత్తది పాతది