సి ఐ అశోక్ హామీ మేరకు ఆందోళన విరమింపు
దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామం కల్వర్టు రోడ్డుపై అత్యధిక లోడుతో ఇసుక లారీలు రోజు 100 నుంచి 200 రోజు తిరుగుతున్నాయి. దీని ప్రభావం వల్ల అక్కడ ఉన్న రోడ్డు, చిత్తడి చిత్తడి అయిపోయి బాగా డామేజ్ అయిపోయింది.ఈ లారీలు తిరగడం వల్ల కనీసం ఆంబులెన్స్ రావడానికి కూడా మార్గం సరిగ్గా లేదు. అందువలన తూరుబాక కలవర్టు వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రావులపల్లి పృద్వి, నిమ్మగడ్డ శ్రీనివాస్, చంచల కృష్ణ, తణుకు సాగర్, సాగర్, వాగే వెంకటేశ్వరరావు, తూరుబాక సర్పంచ్ భూక్య చందు, బానోతు నగేష్, జక్కుల శరత్ ,మోతుకూరి సాయిబాబు, మోతుకూరి వినోద్, గుమ్మడి అనిల్ మరియు తూరుబాక యూత్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి