Good news... రేపటి నుంచి 'రైతు భరోసా': మంత్రి పొంగులేటి

 





ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


TG:   ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా నిధి ఎప్పుడు ఇస్తారో తెలిపింది.


రాష్ట్రంలోని రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. 


పాలేరు నియోజకవర్గ రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు నాటారు. 'రేపటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం. 


వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి ₹12 వేలు ఇస్తున్నాం. BRS ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ₹17వేల కోట్ల రుణమాఫీ చేస్తే, మా ప్రభుత్వం 18 నెలల్లోనే ₹21 వేల కోట్ల రుణమాఫీ చేసింది' అని పేర్కొన్నారు.





Also read...

ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరిత 



 అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరిత గారికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు.


🔹ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో, మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మహిళలు విద్య, విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు.


🔹గృహ బాధ్యతలు, సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అపూర్వమైనదిగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించి మహిళలు విజయాల బాటలో ముందుకెళ్తున్నారని, సరిత గారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు.


🔹"ఇందిరా మహిళా శక్తి" పథకం ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరారు.

Post a Comment

కొత్తది పాతది