గ్రేట్ ఆర్టీసీ డ్రైవర్... బస్ లో దొరికిన లక్ష రూపాయలు డిపోలో ఆనందించారు



మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 మానవత్వం చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్. 


ప్యాసింజర్ పోగొట్టుకున్న 1,00000 లక్ష రూపాయలను డిపోలో అప్పగించిన మహేష్.

 

మణుగూరు డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఇల్లటూరి మహేష్ మంగళవారం మణుగూరు నుండి అమలాపురం డ్యూటీకి వెళ్లి తిరిగి మణుగూరు డిపో కి బయలుదేరి వస్తున్న క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న అశ్వరావుపేటకు చెందిన ప్యాసింజర్ లక్ష రూపాయలు నగదు ఉన్నటువంటి పర్సు బస్సులో పడిపోవడంతో, ఈ విషయాన్ని బాధితుడు ఆర్టీసీ అధికారులకు తెలియజేయడంతో మహేష్ బస్సులో తనిఖీ చేయగా దొరికిన పర్సును గమనించిన డ్రైవర్ మహేష్ దానిలో లక్ష రూపాయలు నగదు ఉండడంతో వాటిని మణుగూరు డిపోసెక్యూరిటీ అధికారులకు అప్పగించాడు. బుధవారం ఉదయం బాధితుడికి లక్ష రూపాయలు అందజేసిన ఆర్టీసీ అధికారులు. పోగొట్టుకున్న లక్ష రూపాయలను తిరిగి ప్యాసింజర్ కు అందజేసిన డ్రైవర్ మహేష్ ని, ప్యాసింజర్, మరియు ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment

కొత్తది పాతది