మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఈ నెల 23.05.25 న మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో మణుగూరు మెయిన్ రోడ్ నందు గల శ్రీవారి జువెలర్స్ షాపులో ఒక్కరు మాత్రమే ఉండడం గమనించి ఒక వ్యక్తి మాస్క్ వేసుకొని షాపు లోపలికి వెళ్లి షాప్ లో పనిచేస్తున్న ఆమెతో మాటల్లో పెట్టి షాపులో నుండి బంగారు ఆభరణాలు సుమారు132 grams గల బాక్స్ ను దొంగిలించడం జరిగింది. షాపు యజమాని అయిన దేవతా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.
మణుగూరు డిఎస్పి శ్రీ రవీందర్ రెడ్డి గారి పర్యవేక్షణలో E బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, మణుగూరు SI ప్రసాద్ మరియు CCS SI రామారావులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం సీసీటీవీ ఫుటేజీ, లాడ్జిలు వెతకడం ప్రారంభించడం జరిగింది.
ఈ క్రమంలో నిన్న 27.05.25 న SI ప్రసాద్ తన సిబ్బంది రామారావు, కొర్ర బాలు లతో హనుమాన్ టెంపుల్ దగ్గర్లో వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి పోలీసు వారిని చూసి భయపడి పారిపోవుటకు ప్రయత్నించగా అతనిని వెంబడించి, పట్టుకొని విచారించగా తన పేరు గొర్రెల సత్యనారాయణ R/o ఆకివీడు, భీమవరం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వాడని చెప్పి తాను మణుగూరు శ్రీవారి జువెలరీ షాప్ లో చేసిన దొంగతనం ఒప్పుకొని అందులో నుండి తీసిన బంగారం చైన్లు -6 నల్లపూసల గొలుసు-1 బేబీ రింగ్స్ 5 సుమారు 132 గ్రాముల బరువుగలవి తీసి చూపించినాడు, అంతేగాక తాను అంతకుముందు వరంగల్ సాయి గణేష్ జువెలరీ షాపులో దొంగతనం చేసిన చిన్న చిన్న బంగారం చెవి కమ్మలు 20 జతలు సుమారు 30 గ్రాములు కూడా చూపించినాడు.*
గొర్రెల సత్యనారాయణ సుమారు 35 పైగా రెండు రాష్ట్రాలలో బంగారు షాపులలో దొంగతనం కేసులు నమోదు అవ్వడం జరిగింది.
మణుగూరు, వరంగల్ తో పాటు తిరుపతి, కర్నూల్లో కూడా దొంగతనాలు చేసినట్టు నేరాలు ఒప్పుకోవడం*ఈరోజు నిందితున్ని మణుగూరు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది
ఇట్టి కేసు ఛేదించిన E బయ్యారం CI వెంకటేశ్వర్లు, మణుగూరు SI ప్రసాద్, CCS SI రామారావు మణుగూరు సిబ్బంది రామారావు, బాలు CCS సిబ్బంది వెంకట్ నారాయణ, విజయ్ లను మణుగూరు డిఎస్పి గారు అభినందించడం జరిగింది
ఇటీవల కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందున ఎవరైనా ఊరు వెళ్తున్నప్పుడు పోలీస్ లకు తెలియజేయాలి. అదేవిధంగా ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలు లేకుండా చూసుకోవాలి. ప్రజలందరూ వారి ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని DSP సూచించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి