పినపాక: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు నేరగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏడూల్ల బయ్యారం ఎస్సై రాజకుమార్ అన్నారు.
బుధవారం పినపాక కేజీబీవీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం తదితర అంశాలపై ఉపాధ్యాయులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పినపాక, కరకగూడెం మండల విద్యాశాఖ అధికారులు కొమరం నాగయ్య, జి. మంజుల, రెండు మండలాల రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి