పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలంలో ప్రభుత్వ ఆనుమతి లేకుండా ఇసుక, మట్టి రవాణా చేసినా, డంపింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్, రెవిన్యూ అధికారి రమేష్ తెలిపారు. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలకు విరుద్దంగా ఇసుక తరలింపు, విక్రయం చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీస్‌శాఖ సహకారంతో దాడులు నిర్వహిస్తామన్నారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా ఉండడానికి చెక్ పోస్ట్ లు పెట్టినా కూడా మండలంలో కొన్ని ప్రాంతాల్లో ఇసుక, మట్టిని ట్రాక్టర్ యజమానులు గుట్టు చప్పుడు కాకుండా తోలుతున్నారని సమాచారం అందింది అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎమ్మార్వో నరేష్ తెలిపారు. అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆర్డీవో, మైనింగ్ అధికారుల అనుమతులు ఉన్నవారికి మాత్రమే ఇసుక రవాణా చేయడానికి, విక్రయించే అవకాశం ఉంటుందని తెలిపారు. అనుమతులు లేని వారు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు పట్టా పొలాలు (భూములు) ఉన్నా కానీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు కి తెల్ల రేషన్ కార్డు ఉంటే మాత్రం తీసివేస్తామన్నారు. ఇసుక అక్రమ రవాణా గురించి తెలిసిన వారు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
Breaking news... లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మరో అధికారి
ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్...భారీ గంజాయి పట్టివేత
Breaking news ...యుద్ధం ఆపడానికి ప్రధాన కారణాలు ఇవే
إرسال تعليق