ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు.
దిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
భారత్- పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా వెల్లడించిన కొద్ది సేపటికే పాకిస్థాన్ తన దొంగ బుద్ధిని ప్రదర్శించింది.
కాశ్మీర్, నాగ్రోటా ప్రాంతాల్లో మళ్లీ దాడులకు పాల్పడింది.
దీంతో ఈ విషయాన్ని ప్రధాని మోదీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ భేటీ కీలకం కానుంది.
పాకిస్థాన్ ను మరోసారి నిలువరించాలన్న దానిపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ చర్చిస్తున్నారు.
పాకిస్థాన్ పై మరోసారి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఈ సమావేశం సాగుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ మీటింగ్ పై ఇప్పుడు యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
నమ్మించి మోసం చేసిన పాకిస్థాన్ కు మరోసారి దీటుగా సమాధానం చెప్పాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు.
యుద్ధాన్ని కొనసాగించాలని అంటున్నారు.
దీంతో ప్రధాని మోదీ భేటీ కీలకం కానుంది.
కాల్పుల విరమణ ఒప్పందం చేసిన కొద్దిసేపటికి పాకిస్తాన్ దొంగబుద్ధిని చూపించింది.
ఓవైపు ఆపరేషన్ సింధూర్ ముగియలేదని ఉగ్రవాదులను ఏరు వేసే పనిలో ఉన్నామని భారత్ చెప్తోంది.
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భవిష్యత్తు ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
రేపు జరగబోయే ఇరు దేశాల మీటింగ్ ...
సింధు జలాల వంటి ఒప్పందాలు వాటి గురించి ఎలాంటి చర్చ జరుగుతుందని ఉత్కంఠ పెరిగిందని చెప్పాలి.
ఇప్పటికైనా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకొని ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేస్తే బాగుంటుందని పలువురు నిపుణులు అంటున్నారు.
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కుక్క బుద్ధిని మార్చుకుంటే మంచిదని చెప్పాలి.
పాకిస్తాన్ బుద్ధి ఏమిటో ప్రపంచ దేశాలకి అర్థమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
భారత్ సత్తా ఏంటో ప్రపంచ దేశాలు చూసాయి.
పహాల్గం దాడికి భారత్ పాకిస్తాన్ ల ఉన్న దాదాపు 100 మంది తీవ్రవాదుల్ని మట్టు పెట్టింది.
భారత్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి చేసిన అనంతరం పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకి ఎప్పుడు ఎవరి ఇంటి పైన బాబు పడుతుందో అని కంటిమీద కొనుక్కు లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
భారత్ అనుకున్న ప్రదేశంలో ఉగ్రవాద స్థావరాలపై కచ్చితత్వంతో దాడులను నిర్వహించడంపై భారత ఆర్మీకి ప్రశంసలు వెలివెత్తుతున్నాయి.
భారత్ ఆర్మీ అంటే ఏంటో ప్రపంచ దేశాలకు చూపించింది.
ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా కుదిరిచ్చింది.
ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్కు చుక్కలు చూపిస్తూ ఓవైపు భారతదేశానికి ఎలాంటి హాని కలగకుండా ఉక్కు కవచాని ఏర్పరచిందని చెప్పాలి.
వందమందిని చంపితే వీరుడు అంటారు. ఒక్కరిని కాపాడినా దేవుడు అంటారు. అని బాహుబలి సినిమాలు చెప్పిన విధంగా ఇండియన్ ఆర్మీ వ్యవహరించిందని గర్వంగా చెప్పొచ్చు.
దేశ సంరక్షణను ఇండియన్ ఆర్మీ కంటి మీద కొనుక్కు లేకుండా కంటికి రెప్పలా కాపాడుతోంది.
దేశం కోసం జవాన్లు ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు.
ఈసారి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే భారత్ తీసుకోబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్ కు భారత్ నుంచి ఎలాంటి సాయం అందబోదని ఈ పరిణామాల వల్ల స్పష్టంగా అర్థం అవుతుంది.
ప్రాణాలు కూడా లెక్కచేయకుండా యుద్ధం చేస్తున్న భారత ఆర్మీకి దేశం మీద ఎంత భక్తి ఉందో కళ్లకు కట్టినట్టు అర్థం అవుతుంది.
*ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..*
*భారత్ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు..*
*ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని చెప్పిన ప్రధాని..*
*పాక్ కాల్పులు జరిపితే దీటైనా సమాధానం ఇవ్వాలని రక్షణ దేశాధినేతలకు సూచించిన ప్రధాని..*
*వాళ్ళు ఒక్క బాంబు వేస్తే..మీరు క్షిపణితో దాడి చేసి బదులు ఇవ్వాలని చెప్పిన నరేంద్ర మోడీ..*
*పీవోకే ను భారత్ కు అప్పగించాల్సిందేనన్న నరేంద్ర మోడి..*
*కాశ్మీర్,పీవోకే విషయంలో భారత్ మాట ఒక్కటే..ఆ రెండు వదులుకోవాల్సిందేనన్న ప్రధాని..*
*మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదన్న ప్రధాని నరేంద్ర మోడీ..*
జై జవాన్ , వందేమాతరం
ఇది కూడా చదవండి..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మరో అధికారి
భారత్ పాక్ యుద్ధం కీలక ప్రకటన?
إرسال تعليق