పంచాయతీనే ముద్దు.. మున్సిపాలిటీ వద్దు

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మేధావులారా మేలుకోండి..!


యువకుల్లారా ఆలోచించండి


కార్మిక, కర్షిక సోదరులారా కదలిరండి 


ప్రజలారా ముందుకు సాగుదాం రండి 


రాజకీయ గ్రహణాలను తొలగిద్దాం 


మణుగూరు అభివృద్ధికై ముందుకు కదులుద్దాం 


మున్సిపాలిటీ ఏర్పడి 20 ఏళ్లు 


అయినా అభివృద్ధి, ప్రగతి జాడేది..?


రాజకీయ నాయకుల స్వార్థం..

ప్రజలకు శాపం


సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి 



మణుగూరు : నిర్మాణాత్మక, శాశ్వత ప్రజా ప్రయోజనాల కోసం తీసుకొనే నిర్ణయాలను మాత్రమే ప్రజలు హర్షిస్తారని, తమ తాత్కాలిక రాజకీయ భవిష్యత్ కోసం కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించి వ్యవస్థలను, సంస్థలను నిర్వీర్యం చేసి మణుగూరు మున్సిపాలిటీ ఏర్పాటు చేశారని,అదే ఇక్కడి ప్రజలకు తీరని శాపంగా మారిందని, అలాంటి నాయకులు స్వార్థపు ఆలోచనలతో చేసే పనులతో ప్రజాగ్రహానికి గురి కాబడతారన్నది నేటి పాలకులలు గుర్తెరగాలని ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి అన్నారు. మణుగూరు మున్సిపాలిటీ ఏర్పడి నేటితో 20 సంవత్సరాలు పూర్తయిందని, అయినా పట్టణంలో ని వార్డులలో ప్రగతి అభివృద్ధి జాడ మచ్చుకైన కనిపించడం లేదని, మున్సిపాలిటీ వద్దు పంచాయతీ ముద్దు అంటూ ప్రజలు భావిస్తున్నారని, శనివారం ఆయన మీడియాకు ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. 2018లో అనాటి పాలకులు

 మణుగూరు మున్సిపాలిటీలో 

 రేగుల గండి, చెరువు ముందు సింగారం అశోక్ నగర్ ఇప్పల సింగారం కూనవరం మద్దలగూడెం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని, ఆనాటి కలెక్టర్

 వినతి పత్రం అందజేశారని, 2017 వ సంవత్సరంలో జీవో నెంబర్ 200 ద్వారా నాటి గవర్నర్ నరసింహన్ ద్వారా మున్సిపాలి

టీలో ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నించారని, నేడు ఆనాటి పాలకులే తిరిగి ఈనాటి పాలకు

లుగా మున్సిపాలిటీ పరిధిలోని 

 అన్నారం, రాయి గూడెం, కుంకుడు చెట్ల గుంపు, కమలాపురం గ్రామాలను తిరిగి పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని కోరుతూ 2025 మార్చి 12న స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారని, ఆనాడు మేజర్ పంచాయతీ గా ఉన్న మణుగూరును మున్సిపాలిటీగా

 ఏర్పాటు చేసినరే తిరిగి మున్సిపాలిటీ వద్దు పంచాయతీ కావాలంటూ ఎలా ప్రతిపాదనలు పంపుతారు అంటూ రవి ప్రశ్నించారు. పాలకుల రెండు నాలుకల ధోరణి ఇది నిదర్శనంగా కనిపిస్తుందని ఆయన తెలిపారు.

 2005 సంవత్సరంలో ఏర్పడిన మణుగూరు మున్సిపాలిటీ నేటితో 20 సంవత్సరాలు గడిసాయని, ఏ ఒక్క పక్క సమగ్ర అభివృద్ధి జాడలే లేవన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో అన్నారం, చిన్నరాయి గూడెం, గ్రామాల ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారన్నారు. భారీగా పనులు వసూలు చేస్తున్న అందుకు తగ్గ అభివృద్ధి ఎందుకు జరగడం లేదన్నారు. మున్సిపాలిటీలో కొందరు రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందరే తప్ప సాటి గిరిజన ప్రజా నికం లో మాత్రం ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. యువకు

లు,కార్మిక, కర్షిక ప్రజలందరూ ఆలోచించి రాజకీయ గ్రహణాలను తొలగించి,ఓట్ల కోసం, రాజకీయ ఉనికి కోసం పాటుపడే నాయకులకు బుద్ధి చెప్పాలని కోరారు. 20 సంవత్సరాల మున్సిపాలిటీగా అనేక గిరిజన గ్రామాల ప్రజలు ఉపాధి హామీ పథకానికి దూరమయ్యారని, అలాగే రైతులు కేంద్ర ప్రభుత్వ పథకాలను అందుకోలేక అనర్హులుగా మిగిలిపోయా

రన్నారు. మున్సిపాలిటీ ఏర్పటుతో

 సరాసరి ఒక్కొక్క కుటుంబానికి ఉపాధి హామీ పథకం మరే ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలను అందుకోలేక 20 లక్షల రూపాయల వరకు ఆర్ధికంగా నష్టపోయారన్నారు. ఇటీవల ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఏజెన్సీ మండలం లోని చుంచుపల్లి మండలం ను తొలగించి కార్పొరేషన్ ఏర్పాటు చేసారని, పూర్తిగా

ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు లో మున్సిపాలిటీనితో ప్రజలు ఆర్ధిక స్థితిగతులను కోల్పోయినా రాని విమర్శించారు. గతంలో 2022 లో 200రూ. ఉన్న నల్ల బిల్లును న్యాయ పోరాటం ద్వారా 100/ మార్పించి ప్రజలకు నాయ్యం

చేసానని,2020 లో మున్సిపాలిటీలో పన్నుల మీద పోరాడి ,బార్ అండ్ రెస్టారెంట్ అనుమతులను అడ్డుకున్నానని

తెలిపారు. అలాగే నాటి హైకోర్టు న్యాయ వాది నేటి హైకోర్టు న్యాయ మూర్తి ద్వారా మణుగూరు

మున్సిపాలిటీని తొలగించి పంచాయతీ గా మార్చేందుకు

నాయ్య పోరాటం చేస్తున్నామని

త్వరలోనే విజయం సాధిస్తామని

చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు అవకాశం కలిపిస్తే పోటీలో నిలిస్తానని, ప్రతి

ఒక్కరికి అండగా నిలిసి విద్య, వైద్యం,ఉపాధి, విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కోసం పని

చేస్తానని తెలిపారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక ప్రజల భాగస్వామ్యానికి ఆనవాలు మన పంచాయతీలు. ఇవి పరిపాలనా వికేంద్రీకరణ నమూనాలని,అంతే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ప్రజాప్రతినిధి వ్యవస్థ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, పల్లెల ప్రగతే, దేశ ప్రగతి అని మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం ఎన్ని చట్టాలు చేసినా, నేటికీ అది కలగానే మిగిలిపోయిందని కానీ దానిని సాధించేందుకు ప్రతి ఒక్కరూ తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.నిరంతర శాఖాపరమైన అధికారుల సమీక్షలతో స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించిన నాడే నిజమైన ప్రజాస్వామ్యం గ్రామ స్థాయికి చేరుతుందన్నారు. అప్పుడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని, యువకులు మేధావులు, కార్మికులు, కర్చకులు, జర్నలిస్టు సోదరులు అంతా కలిసి ముందుకు కదలాలని, 20 ఏళ్ల మున్సిపాలిటీ ప్రగతిని, ప్రతి గ్రామానికి చేర్చాలని, మున్సిపాలిటీ వద్దు.. పంచాయతీ ముద్దు అంటూ ముందు రావాలని 

కోరారు.

Post a Comment

కొత్తది పాతది