అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
మద్యం సేవించి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు ఉంటాయని అశ్వాపురం ఎస్ఐ మధు ప్రసాద్ హెచ్చరించారు*. *శనివారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపిన, ట్రాఫిక్ నియమాలు పాటించని వాహనాదారులు, మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే వాహన యజమానులపై చర్యలు తీసుకుంటామని అన్నారు*.
*రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా వాహనం నడిపినా, నంబర్ ప్లేట్ తొలగించినా కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని, మృతుడిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు*. *వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ చలానా నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నెంబర్‌తో పాటు తప్పుడు నంబర్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారని, కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ ప్లేట్ గుర్తించకుండా, నెంబర్ ప్లేట్ విరగ్గొట్టడం చేస్తున్నారన్నారు. వాహనా తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రమేష్ సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు*.
కామెంట్‌ను పోస్ట్ చేయండి