మణుగూరు ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురై పలువురికి గాయాలు
అధికారులు స్పందించాలి
సామాజిక సేవకులు కర్నె బాబురావు
సమితి సింగారం పంచాయతీ కార్యాలయం సమీపంలో పీవీ కాలనీ రోడ్డులో రెండు రోజుల క్రితం ఆకస్మికంగా ఏర్పాటుచేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదాలకు నిలయంగా మారాయని వెంటనే వాటిని తొలగించాలని లేదా ప్రమాదాలకు ఆస్కారం లేకుండా వేగనిరోధకాలుగా పనిచేసే చిన్న పాటి బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మణుగూరు ఏరియా సామాజిక సేవకులు కర్నె బాబురావు అధికారులను కోరారు. సోమవారం నాడు ప్రమాదాలకు నిలయంగా మారిన స్పీడ్ బ్రేకర్లను ఆయన సందర్శించారు. సమితి సింగారం పంచాయతీ కార్యాలయం మూలమలుపు వద్ద కాలనీ రోడ్డులో రెండు రోజుల క్రితం నిర్మించిన స్పీడు బ్రేకర్లు ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో గమనించగా పలువురు గాయపడ్డారని ఓ కార్మిక నాయకుడు తెల్లవారుజామున కాలనీ ప్రయాణిస్తూ బ్రేకర్లను గమనించక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై తలకు గాయం కావడంతో సింగరేణి ఆసుపత్రికి తరలించారని ప్రస్తుతం సింగరేణి మెయిన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని అధికారుల అనాలోచిత నిర్ణయం పలువురు ద్విచక్ర వాహనాలు కిందపడి గాయాల పాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు స్పందించి ప్రమాదాలకు నిలయంగా మారిన స్పీడ్ బ్రేకర్లు తొలగించాలని లేదా తప్పనిసరి అయితే ఎత్తు తగ్గించాలని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని పెయింట్ కూడా వేయాలని లేదా రోడ్డు నిబంధనల ప్రకారం స్టిప్స్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి... భద్రాద్రి: ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
కామెంట్‌ను పోస్ట్ చేయండి