ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి ఎస్బిఐ ఖాతాను వినియోగిస్తున్న వారికి ఫోన్ పే లో ఒక సమస్య తలెత్తుతుంది. ఎవరైనా ఒక వ్యక్తికి ఫోన్ పే చేస్తే హిస్టరీలో కనిపిస్తుంది. బ్యాలెన్స్ ఎంక్వయిరీ చేస్తే అమౌంట్ యాడ్ అయినట్టు చూపించట్లేదు. ఎందుకిలా జరుగుతుందని ఎంతో మంది తలలు గోక్కుంటుకుంటున్నారు. ఎవరిని అడగాలో అర్థం కాని గందరగోళంలో ఎస్బిఐ ఖాతాదారులు ఉన్నారని చెప్పాలి. ఈ సమస్య గురించి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఫోన్ పే కొట్టాక వారికి ట్రాన్సాక్షన్ సక్సెస్ అని చూపిస్తే అవతల వారి ఖాతాలోకి నగదు బదిలీ అయిందని అర్థం చేసుకోవాలి. హిస్టరీలో కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఇంకా డౌట్ పడాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్ ఎంక్వయిరీ విషయంలో కాస్త సమయం పడుతుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు.
إرسال تعليق