ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ :
కోటి కి పైగా మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచిన వనజీవి రామయ్య అనారోగ్యంతో కన్నుమూసారు. 2017 లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ తో గౌరవించిన ఖమ్మం జిల్లా వాసి, మారెమ్మగుడి సమీపంలో నివసించే పద్మశ్రీ వనజీవి రామయ్య గారు అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో లో తుదిశ్వాస విడిచారు.
వనజీవి రామయ్య గారు భౌతికంగా మన నుంచి దూరమైన, వారు నాటిన ప్రతి మొక్క, పెంచిన ప్రతిచెట్టు, కదిలే కొమ్మ, వీచే గాలి, పూచే పూలు, ఆకలి తీర్చే పండ్లు ఆయనను అనుక్షణం గుర్తుచేస్తూనే ఉంటాయి...
నిస్వార్థమైన వారి ఆశయం ఆక్సిజన్ లా..., వారి ఆచరణ పచ్చని చెట్టులా., భవిష్యత్తు తరాల పర్యావరణ పరిరక్షణ ఆలోచనలకు బాటలు వేయాలని కోరుకుంటూ.. వనజీవి రామయ్య గారికి బాధాతప్త హృదయంతో అశృనివాళి..🥲💐🙏
إرسال تعليق