ములుగు జిల్లా ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
తెలంగాణ లో ములుగు జిల్లా లోని తాడ్వాయి మండల మేడారం సమ్మక్క సారక్క దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం 145 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది.
మహాకుంభ మేళ తర్వాత భారతదేశంలో అత్యధిక జనాభా వచ్చేది ఇక్కడికే వచ్చేది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి లో మహాజాతరకు నిధులు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ జాతరకు అనేక రాష్ట్రాల నుంచి దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తుంటారు.
అయితే జాతర ఏర్పాట్లకు, మౌలిక సదుపాయాల కొరకు ఈ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 145 కోట్ల రూపాయల నిధులు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి ఆలయానికి ఇవ్వడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోరిన కోరికల్ని కొంగు బంగారం చేసే సమ్మక్క సారలమ్మ భక్తులకు సకల సదుపాయాలను కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందనే చెప్పాలి.
ఇది కూడా చదవండి....Braking news: రాజీవ్ యువ వికాసం అర్హుల జాబితా రూపొందించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
కామెంట్‌ను పోస్ట్ చేయండి