భద్రాద్రి.. కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

కరకగూడెం మండలం మోతే గ్రామానికి చెందిన నైనరాపు సాగర్ (30) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన గురువారం కరకగూడెం మండలంలో చోటు చేసుకుంది. కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు ప్రకారం .. సాగర్ ఆర్థిక ఇబ్బందులతో 9 వ తేదీన ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో గొడవ పడి ఆవేశంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి108 వాహనంలో మణుగూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి ఇటీవల ఇంటికి తీసుకుని రాగా గురువారం మృతి చెందాడు. మృతుడు భార్య నాగేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు.








Post a Comment

కొత్తది పాతది