వనం నుంచి... దేవత గుడికి.. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం


 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 అర్ధరాత్రి ఒంటిగంటకు నాగదేవత కళ్యాణం. 

 అగ్నిగుండంలో నడిచే కార్యక్రమం.

 పినపాక మండలం జానంపేట గ్రామ ఊరి చివర ప్రధాన రహదారి పక్కన వెలసిన శ్రీ నాగులమ్మ జాతర మూడు రోజులుగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. గురువారం నాడు గుట్ట నుండి నాగదేవత గుడికి వచ్చే కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా నాగదేవతను గోదావరి పుణ్యస్నానం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగాయి. అర్ధరాత్రి నాగదేవత కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది, కళ్యాణం అనంతరం అమ్మవారు అగ్నిగుండంలో నడిచే కార్యక్రమం నిర్వహిస్తామని దేవరపాల జనార్ధన్ తెలిపారు. అనేక గ్రామాల నుండి విచ్చేసిన భక్తజనం తల్లి దీవెనలు తీసుకున్నారు. శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించే కార్యక్రమం నిర్వహిస్తారు. శనివారం శ్రీ నాగదేవత గుడి నుండి గుట్టకు వెళ్లే కార్యక్రమం తో జాతర ముగుస్తుంది.







Post a Comment

కొత్తది పాతది