పినపాక: వరుస అగ్ని ప్రమాదాలకు గురవుతున్న పూరిల్లు

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

పినపాక మండలం సీతంపేట గ్రామంలో గురువారం ఉసిల్ల నరసింహారావు అనే వ్యక్తి పూరిల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు హుటా హుటిన మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ మంటలు ఎలా వచ్చాయనే సద్దిగ్నంలో గ్రామస్తులు ఉన్నారని చెప్పాలి. గూడును కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 రెండు. నెలల వ్యవదిలో మూడు అగ్ని ప్రమాదాలు? 

గత నెల ఫిబ్రవరి 14 వ తారీకున ఇదే గ్రామానికి చెందిన పూస వెంకటేష్, ఫిబ్రవరి 23వ తారీకున గుమ్మల బాబు పూరిళ్లు అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి. నేడు మరో ప్రమాదం చోటు చేసుకుంది.

 రెండు నెలల వ్యవధిలోని మూడు పూరిల్లు అగ్ని ప్రమాదానికి గురవడం చర్చనీయాంచకంగా మారుతుందని చెప్పాలి. ఈ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయని పలువురి ప్రశ్న? అని చెప్పాలి. ఈ గ్రామంలో ఇంకా ఎన్నో పూరిల్లులు ఉన్నాయి. వరుస అగ్ని ప్రమాదాలు జరగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందని గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Post a Comment

కొత్తది పాతది