ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
గురువారం నాడు కరకగూడెం మండలంలోని ZPHS అనంతారం కాంప్లెక్స్ నందు FLN బాలమేళా 2025 కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి
కరకగూడెం మండలం విద్యాశాఖ అధికారి జి మంజుల గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. జడ్పీహెచ్ఎస్ అనంతరం కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎల్ కరణ్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ స్థాయిలోని 09 పాఠశాల నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగినది.పాఠశాలల వారీగా విద్యార్థులు వారి TLM నమూనాలను ప్రదర్శించడం జరిగినది. మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల గారు విద్యార్థులు తయారుచేసిన TLM నమూనాలను పరిశీలించి, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా FLN 2025 బాలమేళా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ *FLN బాలమేళా 2025 కార్యక్రమంలో మారుమూల ప్రాంతమైన కరకగూడెం మండలం, అనంతారం కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాల విద్యార్థులు చక్కని ప్రదర్శన కనబరిచారు. విద్యార్థులు బోధన ఉపకరణాల ద్వారా విషయాన్ని చక్కగా వివరించారు.
విద్యార్థులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు విద్యార్థులను మరింతగా తీర్చిదిద్దాలని ఆమె కోరారు.
అనంతరం విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ప్రశంసా పత్రాలు అందజేశారు.
FLN బాలమేళా2025 అనంతారం కాంప్లెక్స్ స్థాయి లో ఉత్తమ పాఠశాలగా MPPS అనంతారం ఎంపికైంది.
MPPS అనంతారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులను ఎం ఈ ఓ గారు, కాంప్లెక్స్ హెచ్ఎం గారు మెమొంటోతో అభినందించారు.
ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్లు జె.వెంకటేశ్వర్లు, భావ్ సింగ్ ఉపాధ్యాయులు వసంతరావు, కుమారస్వామి, మోహన్ రావు, రామస్వామి, సూర్యనారాయణ, ప్రసాద్, నారాయణ, వినోద్,వినోద, వసంత, ఉమ, మౌనిక సుప్రియ, సి ఆర్ పి లు విష్ణుమూర్తి, జయ బాబు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి