ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్.. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టించిన డాగ్

 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



మణుగూరులో డాగ్స్ స్క్వాడ్ తనిఖీల్లో గంజాయితో ఉన్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా.. మణుగూరు సురక్ష బస్టాండ్లో బుధవారం డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించారు. డాగ్ ఒక్కసారిగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి అరిచింది. పోలీసులు వెంటనే అతనిని తనిఖీ చేయగా కేజీ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ దానం శశి కృష్ణ అనే వ్యక్తి సీలేరు నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. 

దారుణం నానమ్మ కళ్ళలో ఆనందం కోసం హత్య


Post a Comment

కొత్తది పాతది