ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

 *ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి..*

 *మహిళా ఉపాధ్యాయ రాలు దినోత్సవం..*

 కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో భారతదేశపు మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు  సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. సావిత్రిబాయి ఫూలే గొప్ప సంఘ సంస్కర్త అని, మహిళల విద్యాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని అన్నారు.బాల్య వివాహాలపై అలుపెరగని పోరాటం చేసిన సావిత్రిబాయి ఫూలే అడుగుజాడల్లో మహిళలు నడవాలని తెలిపారు.    

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم