గుండెపోటుతో ఎంపీడీవో మృతి

 *గుండెపోటుతో బుగ్గారం ఎంపీడీఓ మృతి* 

*ఎంపీడీఓ మృతికి పలువురి సంతాపం*

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;


జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంపీడీఓ గా విధులు నిర్వర్తిస్తున్న మాడిశెట్టి శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందడం బాధాకరమని పలువురు నాయకులు, ఉద్యోగులు పేర్కొన్నారు. శనివారం రాత్రి కరీంనగర్ లోని ఆయన నివాసంలో ఎంపీడీఓ శ్రీనివాస్ కు గుండె పోటురావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారని అయినా ఆయనను కాపాడుకోలేకపోయామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తూ తెలిపారు.

ఫిబ్రవరిలో జరిగిన బదిలీల్లో శ్రీనివాస్ బుగ్గారం ఎంపిడిఓగా బదిలీపై వచ్చి అంకితభావంతో విధులు నిర్వర్తించారని ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందితో పాటు ఎంపిఓ అఫ్జల్ మియా, పంచాయితీ కార్యదర్శులు, కారొబార్లు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వివిధ పార్టీల నాయకులు శ్రీనివాస్ సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో జగిత్యాల జిల్లాలోని తోటి అధికారులతో, తన సిబ్బందితో గడిపి ఆయన అకాల మరణం చెందడంతో ఉద్యోగులు, నాయకులు, ప్రజలు, దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఎంపీడీఓ శ్రీనివాస్ మృతిచెందిన విషయం తెలుసుకున్న బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్,బుగ్గారం మాజీ జెడ్పిటిసి బాధినేని రాజేందర్ లు, బుగ్గారం ఎంపిఓ అఫ్జల్ మియా, పంచాయితీ కార్యదర్శులు,ఇతర ఉద్యోగులు ఆదివారం కరీంనగర్ లోని ఆయన నివాసానికి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


Post a Comment

కొత్తది పాతది