ఓ వైపు బోధన... మరో వైపు ఆయా డ్యూటీ

 ఆదర్శంగా నిలుస్తున్న రేగుళ్ల అంగన్‌వాడీ టీచర్‌ 


ఓవైపు బోధన... మరో వైపు ఆయా డ్యూటీ..


కరకగూడెం, డిసెంబర్‌ 20, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

 తన డ్యూటీ కానప్పటికీ ఓ అంగన్‌వాడీ టీచర్‌ రెండు రకాల విధులు నిర్వర్తిస్తూ గ్రామస్తులతో శభాష్‌ అనిపించుకుని ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే... కరకగూడెం మండలంలోని రేగుళ్ళ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న మలకం విజయలక్ష్మి ఓవైపు విద్యార్థులకు చదువు నేర్పిస్తూ మరో వైపు హెల్పర్‌గా మారి పిల్లలకు అన్నం వండి పెడుతోంది. గత పదేండ్లుగా విజయలక్ష్మి ఒక్కరే ఇలా రెండు రకాల డ్యూటీలు చేస్తూ భారమైనా నెట్టుకొస్తోంది. అక్కడికి వచ్చే పిల్లలను తన పిల్లల్లా భావిస్తూ రెండురకాల పనులతో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆనందంగా వండి పెడుతూ మరోవైపు చదువు నేర్పించడం పట్ల గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఇప్పటికైనా ఐసీడీఎస్‌ అధికారులు స్పందించి ఈ అంగన్‌వాడీ కేంద్రానికి ఒక హెల్పర్‌ను నియమించాలని గ్రామస్తులు విజ్ఞప్తిచేస్తున్నారు.

Post a Comment

కొత్తది పాతది