టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్....



-జస్వాల్ కే ఎల్ రాహుల్ స్పీడుకు బ్రేకు వేసేది ఎవరు..?

-బూమ్రా కు అడ్డుకట్ట వేయగలరా....

డిసెంబర్,06:

క్రీడా సమాచారం బుల్లెట్ న్యూస్: ఆసీస్ వేదికగా జరుగుతున్న భారత్ -ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ కెప్టెన్ బూమ్రా రథసారధిలో తన మెరుపు బౌలింగ్ తో , జస్వాల్ కేల్ రాహుల్ , తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో అదరగొట్టడంతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించి భారత్ కి తొలి విజయాన్ని అందించారు. సొంత గడ్డపై తొలి పరాభవాన్ని చవి చూసిన ప్యాట్ కమ్మిన్స్ సేన బూమ్రా బంతులకు ఎలా అడ్డు కట్టలు వేస్తారో చూడాలి. నేడు ఓవెల్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇరు జట్లు కూడా బౌలింగ్ బ్యాటింగ్లో బలబలాలు సమంగా ఉండడంతో మరో ఉత్కంఠ భరితమైన మ్యాచ్ ని ప్రేక్షకులు వీక్షించవచ్చు.ప్లేయింగ్ భారత్ 11: యశస్వి జస్వాల్ ,కేఎల్ రాహుల్, శుభమన్ గ్గిల్ ,విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ,రిషబ్ పంత్ ,నితీష్ కుమార్ రెడ్డి(తెలుగు అబ్బాయి), రవిచంద్రన్ అశ్విన్, బూమ్రా (కెప్టెన్), హర్ష రానా...

ఆస్ట్రేలియా 11: ఉస్మాన్ ఖవాజా, ఎంసీ సేని, లబు చేంజ్, స్మిత్, హెడ్, మిచెల్ మార్స్ ,అలెక్స్ క్యారీ, కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నతన్ లైన్ ,బోలాండ్.

Post a Comment

కొత్తది పాతది