విద్యార్థుల అంతర్గత నైపుణ్యాలను తీర్చిదిద్దడానికి నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష ; మండల విద్యాశాఖ అధికారి కే. నాగయ్య

 విద్యార్థుల నైపుణ్యాలను తీర్చిదిద్దడానికి నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష ; మండల విద్యాశాఖ అధికారి నాగయ్య


పినపాక మండల పరిధిలోని వివిధ పాఠశాలలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష నిర్వహించడం జరిగింది . ఈ పరీక్ష ద్వారా జాతీయ విద్యా ప్రమాణాల స్థాయిని గుర్తించి వారికి అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంకా మెరుగుపరచడానికి ఎంతగానో దోహద పడుతుందని మండల విద్యాశాఖ అధికారి కే. నాగయ్య తెలిపారు.

ఎంపీయుపిఎస్ పోతిరెడ్డిపల్లి పాఠశాల ఆరవ తరగతి 9 మంది విద్యార్థులు , మినీ గురుకుల పాఠశాల మూడవ తరగతి లో 29 మంది విద్యార్థులు, రాధిక కాన్సెప్ట్ పాఠశాల 9 వ తరగతి లో 30 మంది విద్యార్థులు,  భాషా హై స్కూల్ 3వ తరగతి లో 50 మంది విద్యార్థులకు, 9వ తరగతిలో 30 మంది విద్యార్థులకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష నిర్వహించడం జరిగింది అని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈపాఠశాలలో సీబీఎస్ఈ పరిశీలకులు , మరియు ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ పాఠశాలల సిబ్బంది , కాంప్లెక్స్ సి ఆర్ పి ఎస్ నిర్వహించడం జరిగింది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష నిర్వహించే పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారి నాగయ్య సందర్శించి , పరిశీలించడం జరిగింది.



Post a Comment

కొత్తది పాతది