ఆందోల్ లో నేడు మంత్రి చే 110 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన

 అందోల్ లో నేడు మంత్రి చే 110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, 

నేడు గురువారం నాడు ఆందోల్ లో 110కోట్లతో నిర్మించబోయే పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శంకుస్థాపనలు చేయనున్నారు, ఇందులో 60 కోట్ల తో నిర్మించబోయే 150 పడకల ఆసుపత్రి, 45 కోట్లతో నిర్మించబోయే నర్సింగ్ కళాశాల భవనాలకు ఆయన అందోల్ గుట్ట పైన శంకుస్థాపన చేయవనున్నారు, అనంతరం నేడు ఆయన జన్మదినం సందర్భంగా పక్కనే గల గురుకుల , కస్తూర్బా , మహిళా పాలిటెక్నిక్ విద్యార్థినీల సమక్షంలో బర్త్డే వేడుకలు జరుపుకో నున్నారు , అనంతరం సంగుపేటలోని లక్ష్మీదేవి గార్డెన్లో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మధ్య ఆయన బర్త్డే వేడుకలను జరుపుకోనున్నారు, ఈ శంకుస్థాపనకు అవసరమైన పనులను గురువారం నాడు ఆయన స్వయంగా పరిశీలించారు, అలాగే నర్సింగ్ కళాశాల తాత్కాలిక భవన గదులను పరిశీలించారు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు, ఆయన వెంట మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి అందోల్ జోగుపేట మున్సిపల్ కౌన్సిలర్లు మార్క్ పేడ్ డైరెక్ట లు సురేందర్ గౌడ్, చిట్టిబాబు, డాకూ రి శివశంకర్, రంగ సురేష్, పట్లోళ్ల ప్రవీణ్ కుమార్, హరికృష్ణ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు, 






Post a Comment

أحدث أقدم