ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:
బాలికపై డాన్స్ మాస్టర్ లైంగిక దాడి చేసిన ఘటనలో 10ఏళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ రాజేంద్రనగర్ పోక్సో కోర్టు గురువారం తీర్పు ఇచ్చిందని పోలీసుల తెలిపారు. మణికొండలో నివాసముండే ఓ బాలికను 2015లో పెళ్లి చేసుకుంటానని చెప్పి నిందితుడు లోబరుచుకున్నాడు. అనంతరం బాలిక ఇంటికెళ్లి తనతో పంపాలని గొడవకు దిగి ఆమె తండ్రిపై దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా శిక్ష ఖరారైంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి