నిరుద్యోగులకు మంచి అవకాశం ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి - ఐటీడీఏ పీవో

 



భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


    భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లా ప్రజలు మీకు తెలిసిన నిరుద్యోగ యువతీ యువకులను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వారి DEET app ను ప్లే స్టోర్ ద్వారా వారి యొక్క ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని రిఫరల్ కోడ్ : JSBCM అని టైప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమని సలహా అందించి వారు రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. 


     ఈ యాప్ లో దాదాపు 900 కంపెనీలు DEET app ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించడానికి రిజిస్టర్ చేసుకున్నాయని ఆయన అన్నారు. 


       కావున నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరనీ ఆయన తెలుపుతూ ఇంకా ఏమయినా సమాచారం కోసం ఐ.టి.డి.ఏ,భద్రాచలం లోని రూమ్ No.13 భవిత సెల్ నందు సంప్రదించ గలరని ఆయన కోరారు.


-------------అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారి చేయడమైనది-----------

1 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది